భారత్ ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.6% వృద్ధి రేటు నమోదు చేస్తుందని OECD తెలిపింది. జీ20 దేశాల్లో సౌదీ అరేబియా తరువాత భారతే వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని, కానీ 2023-24 లో భారత్ వృద్ధి 5.7 శాతానికి నెమ్మదిస్తుందని తెలిపింది.