అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పది నెలలుగా భారీగా తగ్గుతున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు 139.13 డాలర్గు ఉండగా, ప్రస్తుతం 87.81 డాలర్ల వద్ద కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇది 82 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే మాత్రం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో రూ.5 వరకు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.