ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆళ్ల రామకృష్ణారెడ్డి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు : నారా లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 10:48 PM

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం పెనుమాకలో ఏర్పాటు చేసిన ‘బడుడే బడుడు’ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ....  తాను గెలిస్తే ఏడాదిలోగా ఇళ్ల పట్టాలు ఇస్తానని ప్రజలు నమ్మలేదని, లోకేష్ వస్తే ఇళ్లు కూల్చేస్తానన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాటలు నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న పన్నుల భారాన్ని వివరించారు. అలాగే ఇటీవల మృతి చెందిన టీడీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అస్వస్థతకు గురైన కార్మికులను పరామర్శించి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa