కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పిస్తారని భయం లేదని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించనున్న ధావన్.. జట్టును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఐపీఎల్ 2023 సీజన్‌కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ధావన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ టైటిల్ గెలవడం పెద్ద విషయం కాదని కివీస్‌తో వన్డే సిరీస్ గురించి కూడా ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా మరిన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాతే కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలనని వెల్లడించాడు. ‘కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం వస్తుంది.. ఇంతకుముందు బౌలర్‌కి కష్టమైనా ఎక్స్‌ట్రా ఓవర్ వేసేవాడిని.. కానీ ఇప్పుడు జట్టు అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో పరిణితి సాధించాను. నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని, జట్టును బ్యాలెన్స్ చేస్తూ, ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించాలని, ఎవరైనా ఆటగాడు ఒత్తిడిలో ఉంటే.. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి సంతోషంగా ఉండేలా ప్రయత్నించాలి.