‘వన్ లవ్’ ఆర్మ్‌బ్యాండ్‌పై ఫిఫా నిర్ణయానికి వ్యతిరేకంగా జర్మనీ ఆటగాళ్ల వినూత్న నిరసన తెలిపారు. ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఖతర్‌లో వివిధ వర్గాలపై కొనసాగుతున్న వివక్షను నిరసిస్తూ మ్యాచ్‌ల సందర్భంగా ‘వన్ లవ్’ ఆర్మ్‌బ్యాండ్ ధరించి సంఘీభావం తెలపాలని ఏడు యూరోపియన్ జట్లు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఆటగాళ్లెవరైనా ‘వన్ లవ్’ బ్యాండ్‌తో బరిలోకి దిగితే వేటు తప్పదని ‘ఫిఫా’ హెచ్చరించింది. దీనికి నిరసనగా జర్మనీ ఆటగాళ్లు కుడిచేతితో తమ ‘నోరు మూసుకొని’ నిరసన తెలిపారు .‘ఫిఫా’ నిర్ణయంపై యూరోపియన్ దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.