శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు దుమిండ సిల్వకు క్షమాభిక్ష పెట్టిన కేసులో సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. 2011లో జరిగిన ఓ హత్య కేసులో శ్రీలంక పొదుజన పెరమున పార్టీకి చెందిన దుమింద సిల్వాకు 2017లో కోర్టు మరణశిక్ష విధించింది.అయితే రాజపక్సే 2021లో అధ్యక్షుడిగా ఆయనకు క్షమాభిక్ష పెట్టారు. అయితే ఈ ఏడాది మేలో క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దుమిందాను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాదు రాజపక్సేకు సమన్లు జారీ చేసింది. ఆయనకు సమన్లు రావడం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 16న రాజపక్సే కోర్టుకు హాజరయ్యే అవకాశాలున్నాయి.