భారత్ లో నిరుద్యోగం రేటు తగ్గినట్లు నేషనల్ స్టాటస్టికల్ ఆఫీస్ గురువారం తెలిపింది. 2021 జులై-సెప్టెంబర్ మధ్య 9.8 శాతం నిరుద్యోగం రేటు ఉండేదని, ఇది 2022 జులై-సెప్టెంబర్ మధ్య 7.2 శాతానికి తగ్గిందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లోని 15 ఏళ్లకు పైబడిన వయసు గల వారిలో నిరుద్యోగుల సంఖ్య తగ్గినట్లు వివరించింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆధారంగా తాజా నివేదికను విడుదల చేసింది.