టెక్ రంగంలో ఉద్యోగ కోతలు కొనసాగుతున్నాయి. ఆర్థికమాంద్య భయాలతో ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీల్లో మరిన్ని ఉద్యోగాల కోతలు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 853 టెక్ కంపెనీలు ఇప్పటిదాక 137,492 మంది ఉద్యోగులను తొలగించాయి. కోవిడ్ గడ్డుకాలం ప్రారంభమైనప్పటి నుంచి 1388 కంపెనీలు 2,33,483 మంది ఉద్యోగులను తొలగించాయని టెక్ లేఆఫ్‌ల క్రౌడ్‌సోర్స్ డేటాబేస్ వెల్లడించింది. నవంబర్ నాటికి మెటా, ట్విట్టర్, సేల్స్‌ఫోర్స్, నెట్‌ఫ్లిక్స్, సిస్కో ఇతర సంస్థల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు జరిగాయి. అమెజాన్,పీసీ, ప్రింటర్ మేజర్ హెచ్ పీ ఇంక్ వంటి బిగ్ టెక్ కంపెనీలు గ్లోబల్ లేఆఫ్ సీజన్‌లో చేరాయి. ఈ కంపెనీలు రాబోయే రోజుల్లో 10వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయి.