భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 5న ఏపీకి రానున్నారు. విజయవాడలో నిర్వహించే కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అంతేకాకుండా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్రంలో నిర్మించిన 3 జాతీయ రహదారులను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. రాయచోటి-అంగల్లు సెక్షన్ జాతీయ రహదారిని, ఎన్ హెచ్-205పై 4 లేన్ల ఆర్వోబీ-అప్రోచ్ రోడ్లను, కర్నూలులోని ఐటీసీ జంక్షన్ వద్ద నిర్మించిన 6 లేన్ల గ్రేడ్ సెపరేటెడ్ నిర్మాణాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ముదిగుబ్బ-పుట్టపర్తి రోడ్డు విస్తరణ పనులకు భూమిపూజ చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa