నగరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అయోధ్య విజన్ 2047 పనులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం సమీక్షించారు. అధికారిక ప్రకటన ప్రకారం, 30,000 కోట్ల రూపాయల విలువైన 35 శాఖల 260 ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ ప్రణాళికల ఆధారంగా అయోధ్యను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు నాణ్యత, సమయపాలన పాటించి ప్రాధాన్యతలను పాటించాలని ఆదేశించారు. రోడ్లు, ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించిన సమస్యలను ప్రజాపనుల శాఖ వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa