దేశరాజధాని ఢిల్లీలో శద్ధవాకర్ హత్య తరహాలో మరో దారుణం జరిగింది. త్రిలోక్పురిలో నివాసం ఉండే ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది. ఆపై భర్త శరీర భాగాలను ఫ్రిజ్లో దాచింది. ఆ శరీర భాగాలను ఒక్కొక్కటిగా పాండవ్ నగర్, తూర్పు ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో మహిళ కుమారుడు విసిరేశాడు. చాంద్ సినిమా ప్రాంతంలో అర్ధరాత్రి పోలీసులు ఆ యువకుడిని పట్టుకున్నారు. దీంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.