ట్విట్టర్ అధికార పగ్గాలు చేపట్టాక అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు ఎలాన్ మస్క్. మూడు రంగుల వెరిఫికేషన్ టిక్‌లను తీసుకొస్తున్నామని ప్రకటించిన మస్క్ మరో మార్పుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్వీట్ సంఖ్యను పెంచాలని ఒక యూజర్ మస్క్‌కు సలహా ఇచ్చాడు. ట్వీట్స్ సంఖ్యను 420 వరకు పెంచాలని అతను కోరగా, ‘నిజంగా మంచి ఆలోచన’ అంటూ సమాధానం ఇచ్చాడు మస్క్. దాంతో, ట్వీట్స్ సంఖ్యను పెంచడంపై మస్క్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఆరంభంలో ట్విట్టర్ 140 క్యారెక్టర్లనే ఒక ట్వీట్ లో అనుమతించింది. 2018లో దీన్ని 280 క్యారెక్టర్లకు పెంచింది.