దేశంలోని పలు ప్రాంతాల్లో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి, వారికి ఆయుధాలు సమకూరుస్తున్న ఐదుగురు జైషే మహమ్మద్ టెర్రరిస్టులకు ఢిల్లీ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. జాతీయ దర్యాప్తు సంస్థ 2019 మార్చిలో ఈ కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ శైలేందర్ మాలిక్ సోమవారం తీర్పు వెలువరించారు. జీవిత ఖైదు పడిన వారిలో సాజిద్ అహ్మద్ ఖాన్, బిలాన్ అహ్మద్ మిర్, ముజఫర్ అహ్మద్ భట్, ఇష్ఫాఖ్ అహ్మద్ భట్, మెహ్రాజుద్దీన్ చోపన్ లు ఉన్నారు. ఇదే కేసులో తన్వీర్ అహ్మద్ గనీ మరో వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.