ఓ వృద్ధుడి కడుపులో నాణేలను చూసిన వైద్యులు షాకయ్యారు. కర్ణాటక రాయచూరు జిల్లా లింగసుగూరు తాలూకాకు చెందిన ద్యావప్ప (58) మానసిక రోగి. తన చేతికి ఇచ్చే నాణేలను నిత్యం మింగేసేవాడు. ఇలా 187 నాణేలను మింగేశాడు. దీంతో అనారోగ్యానికి గురి కాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కడుపులో కాయిన్లు చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం శస్త్ర చికిత్స చేసి నాణేలు తొలగించారు.