బ్రహ్మంగారిమఠం మండలం దిరసవంచ పంచాయితీ పెద్దిరాజుపల్లి ఎస్సీ కాలనీలో గత పది సంవత్సరాలు నుంచి నిరుపయోగంగా ఉన్న అంగన్వాడి స్కూల్ భవనాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని గ్రామ ప్రజలు సంబంధిత అధికారులకు విన్నవిస్తున్నారు. బుధవారం ఓ ప్రకటనలో విలేకరులకు తెలియజేస్తూ. మా గ్రామంలో అంగన్వాడి కేంద్రం నిర్మాణం చేపట్టి 90 శాతం పనులు పూర్తయి 10 సంవత్సరాలు కావస్తున్న ఈ అంగన్వాడిని సంబంధిత అధికారులు కాని, రాజకీయ నాయకులు కాని కన్నెత్తి చూసిన పాపాన పోలేదని, ఈ అంగన్వాడి సమస్యను పట్టించుకునే నాధులే కరువయ్యారని వాపోయారు.
ఎమ్మెల్యే గడపగడప ప్రోగ్రాం వస్తే గ్రామంలో ఏమి పెండింగ్ ఉందో తెలుస్తుందని, ఎమ్మెల్యే గడప గడప ప్రోగ్రాం రావడం లేదు అందుకనే ఇటువంటి పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇకనైనా సంబంధిత మండల అధికారులు అంగన్వాడి పనులను పూర్తి చేయాలని తెలియజేశారు. లేనిపక్షంలో పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.