ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్ ఒకటి నుంచి బూత్ కమిటీల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 12:33 PM

డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి కమలాపురం నియోజకవర్గంలో ఒకటి లేదా రెండు మండలాలలో ప్రతిరోజు బూత్ కమిటీ సమావేశం నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమలాపురం ఇన్చార్జి నరసింహారెడ్డి అన్నారు. బుధవారం వల్లూరు మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి లో ఆయన నివాసంలో నియోజకవర్గ, క్లస్టర్ కమిటీ, యూనిట్ ఇంచార్జ్, బూత్ కమిటీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు ఒకటి లేదా రెండు మండలాలలో బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం క్లస్టర్ కమిటీ, యూనిట్ ఇన్చార్జిలతో బూత్ కమిటీ అభ్యంతరాల స్వీకరణ, సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అధ్యక్షులు, క్లస్టర్ కమిటీ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జిలు, బూత్ కమిటీ ఇన్చార్జిలు, ఐటిడీపీ నాయకులు, నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com