కరోనా కంటే ముందుగా కొండాపురం లో నిలిపే ప్రతి ప్యాసెంజర్ రైలు నిలుపుదల చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కొండాపురం పర్యటన సందర్భంగా ఆయనని కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలనుండి ఇక్కడ నిలిపే రైళ్లు ఇప్పుడు నిలపకపోవడంవల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయం పైన అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు రైల్వే అధికారులను కలిసి సమస్యలు విన్నవిస్తున్న అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ రెండు రైళ్లు ఆపడానికి చర్యలు తీసుకుంటామని కానీ ఇక్కడ నుండి ప్రయాణం చేసే వారు కచ్చితంగా టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. అఖిలపక్షం వారు కనీసం మూడు రైళ్లు ఆపాలని టికెట్స్ కొనుగోలుకు అందరూ సహకరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేత శివనారాయణ రెడ్డి, వైస్సార్సీపీ మండల కన్వీనర్ నిరంజన్ రెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దేవగుడి భూపేష్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి మనోహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.