ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్ జిల్లా పరిధిలోని జస్రానా ప్రాంతం పాద పట్టణంలోని ఓ ఇన్వర్టర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 4 పిల్లలు, ఇద్దరు పెద్దలు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులుతో పాటు 18 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్నాయి. కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని ఫిరోజాబాజ్ జిల్లా ఎస్పీ ఆశిష్ తివారీ వెల్లడించారు.