తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. తిరుపతి స్టేషన్‌లో ఆగి ఉన్న ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. రైలులోని ఎస్6వ కోచ్‌లో మంటలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యారు. వెంటనే స్పందించి మంటలు ఆర్పేశారు. ఆ సమయంలో రైలు బోగీలో ప్రయాణికులెవరూ లేరు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రయాణికుడు సిగరెట్ వెలిగించడంతో ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నవంబర్ 18న కూడా ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా గూడూరు స్టేషన్‌లో నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.