బుధవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొనుగోళ్ల మద్దతుతో కాసేపటికే స్పష్టమైన లాభాల్లో ఎగబాకాయి. గత కొన్ని రోజుల ట్రెండ్‌ను కొనసాగిస్తూ అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయ సూచీలు రాణిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం సెన్సెక్స్ 81 పాయింట్ల లాభంతో 62,762 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు ఎగబాకి 18,654 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.58 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ICICI బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, HUL, HDFC బ్యాంక్, NTPC, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.