ఇండియాలో ఉన్న అతిపిన్న వయసు సీఈవోలలో రాధిక గుప్తా కూడా ఒకరు. కొన్నికారణాల వల్ల పుట్టుకతోనే ఆమెకు మెడ వంకర. స్కూల్లో, కాలేజీల్లో స్నేహితులే ఉండేవారు కాదు. ఆమె రూపురేఖలు చూపి అందరూ ఏడిపించేవారు. చదువయ్యాక ఇంటర్వ్యూకని వెళితే వరుసగా 7 తిరస్కరణలు. ఇక బతికుండటం వృథా అనుకొని కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఉద్యోగానికీ ఎంపికయ్యాక ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మన దేశానికి తిరిగొచ్చాక సొంత అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థని ప్రారంభించి ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఆమె జీవితంపై కథనాలు రావటంతో మెడ వంకర అమ్మాయిగానే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అనేక మందికి రాధిక స్పూర్తిగా నిలిచారు.