ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి `జగనన్న విద్యా దీవెన` నగదు విడుదల నేపథ్యంలో మదనపల్లెకు చేరుకున్న సీఎం వైయస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బి. నరేష్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అఘా మొహిద్దీన్ ఖాన్ వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం వైయస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa