గతంలో మదనపల్లె, తంబళ్ళపల్లి, పుంగనూరు, పీలేరు, రాయచోటి ఎక్కడ చూసినా కూడా సాగు, తాగు నీరు లేక ఇబ్బందులు పడే పరిస్ధితి, వెయ్యి అడుగులు బోర్లు వేసినా కూడా నీటి లభ్యత లేని ప్రదేశాలు, వర్షాల మీదే ఆధారపడే పరిస్ధితి, సెలైనిటీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు అనేక అనారోగ్యాల పాలైన పరిస్ధితులు, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే సీఎంగారి దృష్టికి మేమంతా తీసుకెళ్ళాం, సీఎం గారు వేల కోట్లతో సాగు, తాగు నీరు కోసం అనేక పథకాలు ప్రారంభించారు. హంద్రీనీవాలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో గాలేరు నగరి నుంచి సీఎంగారి సొంత నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ నుంచి మనకు నీరిచ్చే పరిస్ధితి ఉంది, అక్కడి నాయకులు నీటి సమస్య గురించి చెప్పగా సీఎంగారు అక్కడి బాధలు చూశాను వారికి చేయాలని గాలేరు నగరి అనుసంధానానికి దాదాపు రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చుతో మొదటి ఏడాదిలోనే శంకుస్ధాపన చేసి పనులు ప్రారంభించారు అని ఎంపీ మిదున్ రెడ్డి తెలియజేసారు.