శాసనసభ ఆమోదించిన కొన్ని బిల్లులను నిలుపుదల చేసిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ చర్యను ప్రశ్నిస్తూ న్యాయవాది దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కేరళ హైకోర్టు బుధవారం కొట్టివేసింది.బిల్లులపై గవర్నర్ సంతకం చేసేందుకు కోర్టు గడువు విధించదని, గవర్నర్ విచక్షణాధికారంలో జోక్యం చేసుకోరాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం మణికుమార్, జస్టిస్ షాజీ పి చాలీలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. అసెంబ్లీ ఆమోదించిన ఆరు బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని పిటిషనర్ పివి జీవేష్ పిల్‌లో తెలిపారు.