ఏపీ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త తెలిపింది. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులై ఉండి ఈ సీజన్ లో లభ్దిపొందని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అర్హులైన రైతులు సమీపంలోని ఆర్బీకేల్లో రైతుభరోసా పోర్టల్ ద్వారా శుక్రవారంలోపు నమోదు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి జనవరిలో మూడో విడతతో కలిపి రైతు భరోసా నిధులను జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.