రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీ చేయనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1584.87 కోట్లను విడుదల చేసింది. నవంబరు నెలకు సంబంధించి 62.31 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు వెల్లడించారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని వాలంటీర్లను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం