యావద్దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుండగా, 788 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఇందుకోసం 14,382 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 2,39,76,670 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి తెలిపారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, 36 ఇతర పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కాగా, చివరిది, రెండవది అయిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 5న జరుగనుంది. డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.