ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. భారత్ నుంచి కోహ్లీ 8వ స్థానంలో, రోహిత్ శర్మ 9వ స్థానంలో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, భారత్ నుంచి టాప్-10 లో ఒక్కరూ కూడా లేరు. ఇక ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్ లో బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబుల్ హాసన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. టీమిండియా ఆల్ రౌండర్లు ఒక్కరు కూడా టాప్-10 లో లేరు.