గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నేడు అక్కడ తొలిదశ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టుబడ్డ నగదు, మద్యం, డ్రగ్స్ వివరాలను అధికారులు వెల్లడించారు. సీజ్ చేసిన మద్యం, నగదు, డ్రగ్స్ విలువ మొత్తం రూ.750 కోట్లపైనే అని ఎన్నికల సంఘం వెల్లడించింది. కాగా గత ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న వాటితో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.27.21 కోట్లుగా ఉంది.