గుజరాత్ లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కచ్, సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 19 జిల్లాల్లో విస్తరించి ఉన్న 89 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరగనుంది. 2 కోట్ల మంది ఓటర్లు రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. తొలి దశ ఎన్నికల్లో 788 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 339 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. అధికారులు 14,382 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. బీజేపీ. కాంగ్రెస్ అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపారు. 88 స్థానాల్లో ఆప్, 57 స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.