భార్య సునందా పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసులో థరూర్‌పై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ గతేడాది పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును దిల్లీ పోలీసులు సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన దిల్లీ హైకోర్టు.. కాంగ్రెస్ ఎంపీ థరూర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో శశిథరూర్‌కు ఊరట లభించిన దాదాపు 15 నెలల తర్వాత దిల్లీ పోలీసులు తీర్పుపై రివిజన్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు థరూర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2023 ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది.