ప్రిన్సిపాల్ డా హర్షలతా పంకజ్ అధ్యక్షతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ సందర్భంగా ఒక అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ నేపద్యం రాక్ ది రిబ్బన్ మరియు అందరికీ ఎయిడ్స్ పరీక్ష మరియు సమానత్వం అను ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం అందరూ పాటించాలని తెలిపారు. యాంటీ రెట్రో వైరల్ డ్రగ్స్ వినియోగంతో ఈ వ్యాధిని ఎదుర్కోవచ్చు అని తమ ఉపన్యాసము తెలిపారు.
డా. కొండయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, జిల్లా అడిషనల్ వైద్య ఆరోగ్య అధికారిణి డా. శైలజా గారు మాట్లాడుతూ ఎయిడ్స్ అనగా అక్వయిర్డ్ ఇమ్యునో డిఫీసియన్సీ సిండ్రోమ్. అనగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం. దక్షిణాఫ్రికా అడవుల్లో మానవుడు చింపాంజీ లతో లైంగిక సంపర్కం జరపడం వల్ల హెచ్ఐవి వైరస్ మనుషులకు సంక్రమించిన వ్యాప్తి చెందింది. అమెరికా 1981 జూన్ మొదటి కేస్ నమోదు అయింది. 1986 భారతదేశంలో మొదటి కేస్ నమోదు అయింది. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ ఒకటవ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. ఈ వ్యాధి ముఖ్యంగా 15 నుండీ 35 సంవత్సరాల యువత దీని మారిన పడుతూ ఉండటంతో యువతకు చైతన్యం మరియు అవగాహన కల్పించడం జరుగుతుంది అని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విస్తీర్ణ మరియు మాస్ మీడియా అధికారి దేవి శిరోమణి, డా. మధుసూదన రెడ్డి, డా. విష్ణు వర్ధన్ రెడ్డి ప్రసంగించారు. తరువాత వివిధ పోటీల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.