ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ర్యాలీలో దొంగలు రెచ్చిపోయారు. డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బుధవారం మల్కా గంజ్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొంగలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠీ సహా 20 మంది నేతల మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.