ఏపీలోని అల్లూరి జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కొత్త భల్లగూడలో ఆశ్రమ పాఠశాల క్వార్టర్స్ లో వార్డెన్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాల సిబ్బంది క్వార్టర్స్ లో గుజ్జలి రాధ (32), నన్ని సుమన్ (34) ఆత్మహత్య చేసుకున్నారు. రాధ అదే పాఠశాలలో వార్డెన్ గా పనిచేస్తున్నారు. నివాసగృహంలో మంచంపై దంపతులిద్దరూ విగత జీవులుగా పడిఉండటాన్ని గమనించిన ఇతర సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.