తలమడుగు మండలములోని నిపాని గ్రామములో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ముఖ్య అతిథిగా హాజరై మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 59 లక్షల 52 వేల 909 రూపాయల నిధులతో అబివృద్ది పనులకు గాను భూమిపూజ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యమైన విద్యానందించాలనే ఏకైక లక్ష్యముతో ముందుకు సాగుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. మౌలిక సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య మన ఊరు మన బడితోనే సాధ్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల, వైస్ ఎంపీపీ గడ్డం లసమన్న, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, మండల కన్వీనర్ నాగయ్య యాదవ్, డీఈఓ ప్రణీత, నాయకుకు రాజన్న, సంతోష్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.