నగరపాలక సంస్థ కార్యాలయము నందు ప్రతి సోమవారము ఉదయము 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు కార్పోరేషన్ పరిధిలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంటీఎంసీ కమిషనర్ శారదా దేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు వారి వారి సమస్యలను అర్జీలు రూపంలో ఇవ్వవచ్చునని తెలిపారు. అధికారులు, సచివాలయ సిబ్బంది అందరు పాల్గొని అర్జీలను స్వీకరించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ నెల మొదటి మూడు సోమవారములు మంగళగిరి కార్యాలయం నందు, నాల్గవ సోమవారం తాడేపల్లి లోని జోనల్ కార్యాలయం వద్ద అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. కావున నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు ఈ స్పందన కార్యక్రమమాన్ని సద్వినియోగ చేసుకోవాలని ఆమె కోరారు.