వరుస క్షిపణి ప్రయోగాలు నిర్వహిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్న ఉత్తర కొరియాపై అమెరికా సహా జపాన్, దక్షిణ కొరియాలు ఆంక్షలు విధించాయి. జోన్ ఇల్ హో, యు జిన్, కిమ్ సు గిల్‌పై నిషేధం విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సామూహిక విధ్వంసక ఆయుధాల అభివృద్ధిలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. సింగపూర్, తైవాన్ కు చెందిన ఒక్కొక్కరితో పాటు మొత్తం 8 సంస్థలపై దక్షిణ కొరియా ఆంక్షలు విధించింది. ఇవన్నీ ఇప్పటికే జనవరి 2018, అక్టోబరు 2022 మధ్య అమెరికా విధించిన ఆంక్షల కింద ఉన్నట్టు తెలిపింది. జపాన్ కూడా మూడు సంస్థలు, ఓ వ్యక్తిపై కొత్తగా ఆంక్షలు విధించింది. కాగా, ఉత్తర కొరియా ఈ ఏడాది 6ంకి పైగా క్షిపణులను పరీక్షించింది.