భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం స్వామి వారు స్వర్ణభద్ర కవచధారణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాతం, ఆరాధన, సేవాకాలం, నివేదన తదితర నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం అంతరాలయం నుండి స్వామి వారి ఉత్సవమూర్తులను మేళ తాళాలు, మంగళవాయిద్యాల నడుమ బేడా మండపానికి తీసుకొచ్చారు. తదుపరి నిత్యకళ్యాణమూర్తులకు వైష్ణవ సంప్రదాయం ప్రకారం విశ్వక్సేన ఆరాధన, పుణ్యఃవాచనతో నిత్యకళ్యాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. నంతరం స్వామి వారికి, అమ్మ వారికి కంకణధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మంగళ సూత్రధారణ తదితర కార్యక్రమంను నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.