ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేయకుండా ఈయూ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన మిత్రదేశం భారత్ కు డిస్కౌంట్ పై చమురు అందించడానికి ముందుకు వచ్చింది. అప్పట్నుండి భారత్ తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకుంటుంది. అయితే, భారత్ లాగే పాకిస్థాన్ కూడా తక్కువ ధరకు చమురు పొందాలని యత్నించింది. పాక్ పెట్రోలియం శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ నేతృత్వంలోని అధికారుల బృందం రష్యాకు వెళ్లి తమకు కూడా 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ తో చమురును సరఫరా చేయాలని కోరారు. అయితే, పాకిస్థాన్ అభ్యర్థనను రష్యా తిరస్కరించింది.