బ్రహ్మంగారిమఠం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, ఎంబీసీ సాధికార సమితి స్టేట్ మెంబర్ సారె రామానాయుడు లు శుక్రవారం ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని మైదుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రారంభించారు. ఈ కార్యక్రమం పురస్కరించుకుని ముడమాల పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి ముడుమాల గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.