ముంబయి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక రాజధానిలో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 2 నుంచి జనవరి 2 వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. నగరవ్యాప్తంగా ఐదుగురికి మించి గుమిగూడడం, నిరసనలు, ఆందోళనలు, ప్రచారాలు చేయడాన్ని నిషేధించారు. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించామని నగర డిప్యూటీ కమిషనర్ విశాల్ ఠాకూర్ వెల్లడించారు. ప్రజలందరూ గమనించాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa