కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకోబోతుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జునఖర్గేనే తిరిగి కొనసాగించే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. పార్టీ అగ్రనేత చెప్పిన ‘ ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ విధానానికి గండి పడినట్లవుతుంది. కాంగ్రెస్ ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్ తీర్మానం ప్రకారం.. ఎవరికైనా ఇది వర్తిస్తుందని రాజస్థాన్ కాంగ్రెస్ ముసలం సమయంలో ఆ పార్టీ ఎంపీ, కీలక నేత రాహుల్ గాంధీ నొక్కి మరీ చెప్పారు. అయినప్పటికీ ఖర్గేనే కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.