ఉత్తర చెన్నైకి ఓ ల్యాండ్ మార్క్ గా ఉన్న అగస్త్య థియేటర్ కనుమరుగైంది. 55 ఏళ్లుగా ప్రేక్షకులకు వినోదం అందించిన ఈ థియేటర్.. ఇప్పుడు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. 1967లో ‘భామా విజయం’ అనే చిత్ర ప్రదర్శనతో ప్రారంభించిన ఈ థియేటర్ లో 70 ఎంఎం స్క్రీన్, డాల్బీ సౌండ్ సిస్టమ్ వంటి సౌకర్యాలుండేవి. తండయార్ పేటలో ఉన్న ఈ థియేటర్ ను ఇప్పుడు కూల్చేస్తున్నారు. నిజానికి 2020 నుంచే ఇక్కడ సినిమాల ప్రదర్శన నిలిపేశారు. థియేటర్ ను కూలుస్తుండగా స్థానికులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.