ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఊసవానిపేట సమీపంలో ఉన్న రైల్వే గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం పై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలు వస్తే సుమారు 20 నిమిషాల పాటు వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, ఎంతో కాలంగా బ్రిడ్జి నిర్మాణం పరిశీలన సాగుతుందని ఇప్పటికైనా సంబంధిత రైల్వే శాఖ అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ రహదారి గుండా సుమారు పలు గ్రామాలకు ముఖ్యమైన రహదారి కావడంతో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ మార్గం గుండా రోజుకు 80-90 రైళ్ళు బళ్ళు ప్రయాణించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైలు అధికారులు సర్వేలు పూర్తి చేసి నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రయాణికులు అంటున్నారు.