కొత్తూరు మండలానికి చెందిన శోభనాపురం గ్రామంలో మాస్టర్ శిక్షకులు ఎస్. సూర్యనారాయణ ఆధ్వ ర్యంలో శనివారం ప్రకృతి వ్యవసాయ పొలంలో పంటకోత ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా 18 రకాల నవధాన్యాలు వేసిన ఎకరా పొలంలో 18420 కేజీల రాగులు (36 బస్తాలు) వస్తాయని అంచనా వేశారు. అలాగే 16 రకాలు వేసిన రైతుకు 16, 550 (32 బస్తాలు) దిగుబడి వస్తుందని తెలిపారు. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయానికి రసాయనిక వ్యవసాయానికి మధ్య ఉన్న తేడాను కూడా గుర్తించవచ్చని ఈ సందర్భంగా రైతులకు తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్ శిక్షకులు ఎస్. సూర్యనారాయణ, ఐసిఆర్పిలు చిన్నమ్మి, సింహాచలం, రామారావు, శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.