పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి 175 నియోజకవర్గాలకు నియోజకవర్గ పరిశీలకులను నియమించారు. ఏ జిల్లాలోని పరిశీలకులు ఆ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు పరిశీలకులుగా నియమించి, పార్టీ కార్యక్రమాలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్న అంధవరపు సూరిబాబును విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి పరిశీలకులుగా నియమించారు. గజపతి నగరం శాసన సభ్యులు బొత్స అప్పలనర్సయ్య నివాసంలో శనివారం జరిగిన సమావేశంలో విజయనగరం జిల్లా పరిశీలకులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు పార్టీ పరిశీలకులతో జరిగిన సమావేశానికి విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లాపరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మాత్యులు, రీజనల్ కో-ఆర్డినేటర్ బొత్స సత్యన్నారాయణ మాట్లాడారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు సంపంగి చిన్న వెంకటప్పలనాయుడు, కంబాల జోగులు, విశ్వసరాయ కళావతి, అలజంగి జోగారావు, పుష్పశ్రీవాణి, సద్గుణ సాయి, శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, రఘురాజు, డాక్టర్ సురేష్ మరియు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల పరిశీలకులు పాల్గొన్నారు.