నకిలీ మందులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మందులపై బార్ కోడ్ తప్పనిసరి చేసింది. 300 డ్రగ్ ఫార్ములేషన్స్ పై కంపెనీలు బార్ కోడ్ ముద్రించాల్సి ఉంటుంది. ఇది 2023 ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీన్ని మెడిసిన్ ఆధార్ కార్డుగా పరిగణిస్తున్నారు. ఈ బార్ కోడ్ లో మాన్యుఫ్యాక్చరింగ్ లైసెన్స్, చిరునామా, తేదీ, బ్యాచ్ నెంబర్, డ్రగ్ జనరిక్ పేరు వంటి వివరాలు కంపెనీలు పొందు పరచాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువగా అమ్ముడు పోయే అల్లెగ్రా, డోలో, అగ్మెంటిన్, సారిడాన్, కాల్ పోల్, థైరోనార్మ్ వంటి మందులున్నాయి.