కలియుగ వైకుంఠం తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీనివాసుడి దర్శనం కోసం 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శనివారం రోజు స్వామివారిని 63,931 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,813 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీనివాసుడి హుండీకి రూ.3.48 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.