ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మార్గం ఢిల్లీ-లేహ్ మధ్య బస్సులు నడిపేందుకు హిమాచల్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ సిద్ధమైంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనుమతులు వచ్చిన తర్వాత అన్నీ అనుకూలిస్తే వచ్చే మే నుంచి తిరిగి బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయి. గత సెప్టెంబర్ 15న ఈ మార్గంలో బస్సు సర్వీసులు నిలిపేశారు. 1,026 కి.మీ ఉన్న ఈ మార్గం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పొడవైన మార్గం. ఈ ప్రయాణం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎత్తైన కనుమ గుండా బస్ సర్వీసులు నడిపిన కీలాంగ్ డిపో పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది.