ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణార్థం ఆదివారాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను జరిపించి అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు చేసి పల్లకీలో ఆశీనులను జేశారు. అనంతరం పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు.